స్వర్ణ గ్రామంలో పేకాట శిబిరంపై పోలీసుల మెరుపు దాడి

734చూసినవారు
బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో ఆదివారం పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఎస్ఐ ఖాదర్ భాషా నేతృత్వంలో జరిగిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 790 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామాలలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్