పర్చూరు రైతుకు రాష్ట్ర స్థాయి అరుదైన గౌరవం

394చూసినవారు
పర్చూరు రైతుకు రాష్ట్ర స్థాయి అరుదైన గౌరవం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ (APSSCA) పాలక మండలిలో విత్తన వినియోగ రైతుల ప్రతినిధిగా, రాష్ట్ర డైరెక్టర్‌గా బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన మాలెంపాటి సత్యనారాయణను ప్రభుత్వం నియమించింది. ఈ నియామకం పర్చూరు నియోజకవర్గానికి అరుదైన గౌరవంగా నిలిచింది. రెండు సంవత్సరాల పాటు పాలక మండలి సభ్యుడిగా కొనసాగనున్న సత్యనారాయణ, రాష్ట్రంలో విత్తనాల నాణ్యత, ధృవీకరణ, రైతులకు అందే విత్తనాల ప్రమాణాలను నిర్ణయించే కీలక సంస్థలో రైతు ప్రతినిధిగా వ్యవహరించనున్నారు. దీనివల్ల పర్చూరు రైతుల సమస్యలు నేరుగా ప్రభుత్వ వ్యవసాయ శాఖ వేదికకు చేరనున్నాయి. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్