కావలిలో ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఒక ఎరుకల మహిళపై టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ వర్గీయులైన ముస్లింలు దాడి చేసి వివస్త్రను చేసిన ఘటనను ఎస్సీ ఎస్టీల సంఘం రాష్ట్ర నాయకుడు దేవరకొండ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఆదివారం చీరాలలో ఆయన మాట్లాడుతూ, ముద్దాయిలు ఏ పార్టీకి చెందిన వారన్నది పక్కనపెట్టి, ఎస్టీ మహిళను హింసించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కావలి పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు తదుపరి చర్యలను వేగవంతం చేయాలని కోరారు. ముద్దాయిలను రక్షించే ప్రయత్నం జరిగితే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.