ప్రముఖ హేతువాది కవి, రచయిత స్వర్గీయ ఎ.ఎన్.వి. బ్రహ్మం గారి సతీమణి సీతారావమ్మ సంస్మరణ సభ చినగంజాంలోని వారి స్వగృహం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుండూరు వాసు, మాజీ సర్పంచ్ (కొత్తపేట, చీరాల) పాల్గొని సీతారావమ్మ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సీతారావమ్మ గారి జీవనయాత్రను, కుటుంబం పట్ల ఆమె చూపిన ఆదర్శ విలువలను పాల్గొన్నవారు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది.