చీరాల మోడల్ స్కూల్ వద్ద సర్వీస్ రోడ్డు: కలెక్టర్ కు విజ్ఞప్తి

515చూసినవారు
చీరాల మోడల్ స్కూల్ వద్ద నేషనల్ హైవే నుంచి సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ను జర్నలిస్ట్ సంఘం నాయకులు కోరారు. స్కూల్, హాస్టల్, ఫిజియోథెరపీ హాస్పిటల్ ఉండటంతో విద్యార్థులు రాకపోకల సమయంలో ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యను పరిశీలించి సర్వీస్ రోడ్డు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల సంఘం నాయకులు దమ్ము విజయ్ కుమార్, కాటి కమలాకర్, కావూరి రాజేష్ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్