పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎస్‌ఎస్‌ఎన్ కళాశాల మైదానంలో నూతన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు జిల్లా కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు, సహచర శాసనసభ్యులు, మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీ షేక్ జానీ సైదా గారికి, జిల్లా కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే మాలకొండయ్య గారు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతం, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.