చీరాలలో ఆర్ఎల్‌ల కొరత: ఇన్‌చార్జ్ వ్యవస్థపై ప్రజల ఆరోపణలు

2804చూసినవారు
చీరాలలో ఆర్ఎల్‌ల కొరత: ఇన్‌చార్జ్ వ్యవస్థపై ప్రజల ఆరోపణలు
బాపట్ల, చీరాల నియోజకవర్గాల్లో గత రెండేళ్లుగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్ఎల్‌) పోస్టులు ఖాళీగా ఉండటంతో వీఆర్వోలతోనే ఇన్‌చార్జ్ బాధ్యతలు నిర్వహింపజేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనివల్ల జనన, మరణ, కుల, ఆదాయ, ఈడబ్ల్యూఎస్ వంటి ధ్రువపత్రాల జారీలో ఆలస్యం జరుగుతోందని, అక్రమ వసూళ్లకు ఆస్కారం ఏర్పడిందని విమర్శలు వస్తున్నాయి. శాశ్వత ఆర్ఎల్‌ల కొరత వల్ల రెవెన్యూ పరిపాలన దెబ్బతింటోందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని శనివారం స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్