బాపట్ల జిల్లా, వేటపాలెం మండలంలోని దేశాయిపేట గ్రామంలో జనవరి 13వ తేదీన శుక్రవారం శ్రీశైలం దేవస్థాన తలపాగా కార్యక్రమం నిర్వహించబడుతుంది. దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో సంఘ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బుసము శ్రీనివాస రావు, హస్తినపురం బట్ట సాంబ శివారావు (శివా) పాల్గొంటారు. చీరాల శాసన సభ్యులు మద్దూలూరి మాలకొండయ్య విశిష్ట అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో దేవాంగ ప్రతినిధులు, గ్రామ సభ్యులు, అభిమానులు, కూటమి నాయకులు కూడా పాల్గొంటారు.