బాపట్ల జిల్లా, చీరాల మండలం, దేవాంగపురి గ్రామపంచాయతీ పరిధిలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని స్మరించుకున్నారు. చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారి ఆదేశాల మేరకు, సీనియర్ టిడిపి నాయకులు శ్రీ సిద్ధి బుచ్చేస్వరరావు గారి ఆధ్వర్యంలో గ్రామంలో ప్రజా చలివేంద్రం ఏర్పాటు చేసి, గ్రామ ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం దేవాంగ పురి మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద గ్రామ పెద్దల సహకారంతో టిడిపి జెండాను ఎగరవేసి ఆవిష్కరణ చేశారు.