ఆర్జీయూకేటీ రెండో జాబితాలో బాపట్ల జిల్లా విద్యార్థినులకు ట్రిపుల్ ఐటీ సీట్లు

4629చూసినవారు
ఆర్జీయూకేటీ రెండో జాబితాలో బాపట్ల జిల్లా విద్యార్థినులకు ట్రిపుల్ ఐటీ సీట్లు
సోమవారం విడుదలైన ఆర్జీయూకేటీ రెండవ జాబితాలో బాపట్ల జిల్లా, వేటపాలెం మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. పందిళ్ళపల్లి, వేటపాలెం జడ్పీ హైస్కూల్ విద్యార్థినులు పొన్నూరి కీర్తి దుర్గా కామాక్షి, అవ్వారు భువనేశ్వరి 10వ తరగతిలో 572, 571 మార్కులు సాధించి ఒంగోలు క్యాంపస్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్