
ఫిరంగిపురం: కాల్వలో ఈతకు దిగి వ్యక్తి మృతి
గుంటూరు జిల్లా మేడికొండూరులో విషాదం చోటుచేసుకుంది. మేడికొండూరుకు చెందిన తలతోటి సుధీర్ (30) తన స్నేహితుడితో కలిసి నరకుల్లపాడు మేజర్ కాల్వలో ఈతకు దిగాడు. దురదృష్టవశాత్తు, సుధీర్ నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.







































