గుంటూరులో నిన్నటి ఘటన నేపథ్యంలో మంత్రి అంబటిపై మూడు కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దూషణలు, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలున్నాయి. పిల్లి మాణిక్యరావు ఫిర్యాదుతో నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు, SI రామకృష్ణ ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. అలాగే, సీఎంను దూషించారని TDP నేత కనుమూరి బాజీ ఫిర్యాదుతో పల్నాడు జిల్లా నకరికల్లులో మరో కేసు నమోదైంది.