పొన్నెకల్లు వద్ద ప్రమాదం.. రెండు ఆటోలు ఢీ

1770చూసినవారు
తాడికొండ (M) పొన్నెకల్లు వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. తాడికొండ అడ్డరోడ్డు నుంచి పొన్నెకల్లు వైపు వెళ్తున్న ఆటో, ఎదురుగా వస్తున్న మరో ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, ఒక మహిళ కాలు విరిగింది. ఈ రహదారి సరిగా లేకపోవడం వల్ల ఇప్పటివరకు 40కి పైగా ప్రమాదాలు జరిగాయని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్