ABNపై మాజీ MP మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం గుంటూరులో ఆ సంస్థ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. 2029లో
వైసీపీ అధికారంలోకి రాగానే ముందుగా ఆ ఛానల్‌పైనే వేటు వేస్తామని హెచ్చరించారు. రాధాకృష్ణ వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలుసని, తప్పుడు వార్తలతో వ్యవస్థలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.