తాడేపల్లిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యువతి వేధింపులకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్ పరిచయం ప్రేమగా మారి, 8 నెలల క్రితం పెద్దల సమక్షంలో నాగరాజుతో వివాహం జరిగినట్లు సమాచారం. అనంతరం బ్రహ్మానందపురంలో కాపురానికి తీసుకొచ్చిన భర్త, అత్తమామలు చిత్రహింసలకు గురిచేశారని, గత మూడు రోజులుగా ఇంట్లో బంధించి, బయటకు వస్తే చంపేస్తామని బెదిరించారని స్థానికులు చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.