శుక్రవారం, ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరులో పర్యటించనున్నారు. ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన కానూరి-జింకానా మాతాశిశు సంరక్షణ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా బయల్దేరి 10.40కి గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు. అనంతరం స్థానిక నేతలను కలిసి 10.45కి GGHకి బయల్దేరి, 11 నుంచి 12 గంటల మధ్యలో నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత చిత్తూరు బయలుదేరి వెళతారు.