దుగ్గిరాల (M) చిలువూరులో బుధవారం సాయంత్రం బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో 19 ఏళ్ల యువకుడు యాస్కే వలి మృతి చెందాడు. గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్ పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడిన వలిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.