బాలికలకు ఉచితంగా రెడీమేడ్ దుస్తుల పంపిణీ

0చూసినవారు
బాలికలకు ఉచితంగా రెడీమేడ్ దుస్తుల పంపిణీ
గుంటూరు నల్లచెరువులోని మున్సిపల్ కార్పొరేషన్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల (85)లో STU గుంటూరు నగర శాఖ ఆధ్వర్యంలో 50 మంది బాలికలకు ఉచితంగా రెడీమేడ్ దుస్తులు పంపిణీ చేశారు. రామా డ్రెస్సెస్ యాజమాన్యం సౌజన్యంతో కొరివి విజయ్ బాబు పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. STU నగర శాఖ అధ్యక్షుడు ఉగ్గం మహంకాళరావు దుస్తులు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దరియావలి, STU ప్రధాన కార్యదర్శి శంకర వరప్రసాద్, ఉపాధ్యాయులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్