గుంటూరు: చికిత్స పొందుతూ ఒకరి మృతి

988చూసినవారు
గుంటూరు: చికిత్స పొందుతూ ఒకరి మృతి
గత నెల 28న పేరేచర్ల నుంచి ఆటోలో టెంట్ హౌస్ సామాను తెస్తుండగా పలకలూరు రైల్వేగేటు సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లవరపు జీవరత్నం (58) అనే వ్యక్తి బుధవారం జీజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు నల్లపాడు పోలీసులు తెలిపారు. జీవరత్నం కుమారుడు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.