చేబ్రోలులో అక్రమంగా తొలగించిన పంచాయితీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గుంటూరు నగర భవన నిర్మాణ కార్మిక సంఘం నగర ప్రధాన కార్యదర్శి దీవెనరావు, సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గుంటూరు డొంక రోడ్డు జోన్లో శనివారం భవన నిర్మాణ కార్మికుల నగర కమిటీ సమావేశం జరిగింది. వారు మాట్లాడుతూ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పంచాయితీ కార్మికులను తొలగించటం అన్యాయమని అన్నారు.