గుంటూరులోని చుట్టుగుంట మెయిన్ రోడ్డుపై శనివారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఒక ట్యాంకర్ కారును స్వల్పంగా ఢీకొట్టింది. అదృష్టవశాత్తు కారులోని ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం తర్వాత ఇరు డ్రైవర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చి, వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.