గుంటూరు జిల్లాలో గురువారం అన్ని పాఠశాలలకు మరియు కళాశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ సి. యం. సాయికాంత్ వర్మ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఈఓ సలీం భాష తెలిపారు. పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని,
విద్యార్థులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు.