గుంటూరులో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ద్వితీయ సంవత్సరం విద్యార్థినికి అసభ్య సందేశాలు పంపిన మహేశ్ అనే యువకుడిపై పాతగుంటూరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కాకాని రోడ్డుకు చెందిన విద్యార్థినితో పరిచయం పెంచుకున్న నిందితుడు కొంతకాలంగా వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెంకట ప్రసాద్ వెల్లడించారు.