గుంటూరులోని నల్లచెరువు మున్సిపల్ కార్పొరేషన్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల–85లో శుక్రవారం STU గుంటూరు నగరశాఖ ఆధ్వర్యంలో రామా డ్రెస్సెస్ సహకారంతో 50 మంది బాలికలకు రెడీమేడ్ దుస్తులను పంపిణీ చేశారు. STU గుంటూరు నగరశాఖ అధ్యక్షులు ఉగ్గం మహంకాలరావు చేతుల మీదుగా ఈ పంపిణీ జరిగింది. బాలికలకు అవసరమైన దుస్తులను అందజేసి, సామాజిక బాధ్యతను చాటుకున్న రామా డ్రెస్సెస్ యాజమాన్యానికి, కొరివి విజయ్ బాబు, ఉగ్గం మహంకాళ రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.