గుంటూరులోని నల్లచెరువు మున్సిపల్ పాఠశాలలో మున్సిపల్ అధికారులు 'స్వచ్ఛతా హి సేవ' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, చెత్త నిర్వహణ, పరిశుభ్రతతో ఆరోగ్యం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. స్వచ్ఛతపై డ్రాయింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.