ఓటర్ ఎన్యూమరేషన్‌కు మరో నెల గడువు పొడిగించాలి.

4296చూసినవారు
ఓటర్ ఎన్యూమరేషన్‌కు మరో నెల గడువు పొడిగించాలి.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా చేపట్టిన ఓటర్ ఎన్యూమరేషన్‌కు మరో నెల గడువు పొడిగించాలని జన చైతన్య వేదిక డిమాండ్ చేసింది. శనివారం గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కె. ఎస్. లక్ష్మణరావు, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తదితరులు ఈ మేరకు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రతి అర్హ ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా గడువు పెంచాలని, త్వరలో సీఈఓ వివేక్ యాదవ్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా 'సర్ వాలంటీర్ గైడ్' పుస్తకాన్ని ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్