గుంటూరులో అల్లూరి సీతారామరాజు 130వ జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కె. ఎస్. లక్ష్మణరావు మాట్లాడుతూ గిరిజనుల విద్య, వైద్యం, ఉపాధి, ఆదాయ స్థాయిల్లో మార్పు తీసుకురావడమే అల్లూరికి నిజమైన నివాళి అని అన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరగా, రెడ్ క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. రామచంద్రరాజు అల్లూరి ఆశయాల సాధనలో యువత ముందుండాలని పిలుపునిచ్చారు.