పాతగుంటూరుకు చెందిన SD. భాష, విజయవాడ భవానీపురానికి చెందిన గుంజి గోపీకృష్ణలను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులో ఇజ్రాయేల్‌పేట రైల్వేట్రాక్ పక్కన గంజాయి విక్రయిస్తుండగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 1,300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలను సహించబోమని పోలీసులు తెలిపారు.