గుంటూరు వెస్ట్ - Guntur West

వీడియోలు


పెద్దపల్లి జిల్లా
Oct 28, 2025, 09:10 IST/వేములవాడ
వేములవాడ

రక్తదానం ప్రాణధానంతో సమానం: ఎస్పీ

Oct 28, 2025, 09:10 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే మాట్లాడుతూ, రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి జీవితాలను కాపాడడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని కల్యాణ లక్ష్మీ గార్డెన్స్‌లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో యువత, ప్రజలు, ఆటో డ్రైవర్లు, పోలీస్ అధికారులు, సిబ్బందితో సహా సుమారు 460 మంది పాల్గొన్నారు. పోలీసులు శాంతి భద్రతలను పరిరక్షించడమే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారని, రక్తదానంపై అపోహలను నమ్మకుండా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అత్యవసర, ప్రమాద సమయాల్లో, తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ రక్తదానం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.