శుక్రవారం అసెంబ్లీలో ఆర్ఎంపీల సమస్యలపై, 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం గ్రామీణ వైద్యుల కొరకు 465 జీవో అమలులో తగిన గుర్తింపు ఇవ్వాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు లేవనెత్తిన అంశాలపై అనుభవ వైద్య సంఘాల సమాఖ్య పోలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర సమాచార శాఖ కమిటీ చైర్మన్ ఉపేందర్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సమస్యలపై అసెంబ్లీలో గద్దె రామ్మోహన్ రావు చేసిన కృషిని ఉపేందర్ రెడ్డి ప్రశంసించారు.