చేబ్రోలు మండలం శలపాడులో ఆదివారం పంట కాలువలో వ్యర్థాలను తొలగిస్తుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి మట్టి 10 అడుగుల మేర పైకి లేచిందని బాధితుడు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రాంతంలో టపాకాయల తయారీదారులు మందును ఇక్కడ దాచి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.