తుళ్లూరు (M) రాయపూడి CRDA కార్యాలయం సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. అశోక్ లేలాండ్ వాహనం, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న ఇద్దరు, అశోక్ లేలాండ్‌లో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.