గుంటూరు రాజాగారితోటలోని బీసీ స్టడీ సర్కిల్, APPSC గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి ఉచిత శిక్షణను అందించనుంది. ఈ నెల 17లోపు ఆసక్తి కలిగిన SC, ST, BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. డిగ్రీ మార్కుల ఆధారంగా 100 మంది అభ్యర్థులను ఎంపిక చేసి, వారికి ఉచిత శిక్షణతో పాటు స్టైపెండ్, స్టడీమెటీరియల్ కూడా అందించనున్నారు.