గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవి శనివారం వెలగపూడిలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడుతూ స్త్రీ సంక్షేమం, మహిళా సాధికారత విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీ అని, మహిళల అభ్యున్నతి కోసమే ఆ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. స్త్రీ సాధికారతకు కృషి చేస్తున్న చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.