గుంటూరు: ప్రభుత్వం జాషువా జయంతిని పట్టించుకోవడం లేదు

2చూసినవారు
గుంటూరులో ఆదివారం బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరి క్రాంతి కుమార్ మాట్లాడుతూ, ప్రముఖ కవి గుర్రం జాషువా 130వ జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, అయితే ప్రభుత్వం మాత్రం ఆయనను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో గుర్రం జాషువా పేరును వాడుకుంటాయని, కానీ అధికారంలోకి వచ్చాక ఆయన జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహించడంలో విఫలమవుతున్నాయని క్రాంతి కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందన లేదని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్