గుంటూరు: కాకుమానువారితోటలో భారీ చోరీ

260చూసినవారు
గుంటూరు: కాకుమానువారితోటలో భారీ చోరీ
గురువారం రాత్రి అరండల్పేట ఠాణా పరిధిలోని కాకుమానువారితోటలో భారీ దొంగతనం జరిగింది. స్వీట్ షాపు నడుపుతున్న నల్లమల్లి సాయి పవన్ కుమార్ ఇంట్లోకి చొరబడిన దొంగలు, గ్రిల్లుకు తాళం వేయకుండా ఉన్న గడియను తీసుకుని లోపలికి వెళ్లారు. పడకగదిలోని సరుగులో ఉన్న 134 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు రూ. 25వేల నగదును అపహరించుకుపోయారు. శుక్రవారం ఉదయం దొంగతనం జరిగినట్లు గ్రహించిన సాయి పవన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్