గుంటూరు: పవన్ కళ్యాణ్ నోరు విప్పి మాట్లాడాలి – అంబటి రాంబాబు

2చూసినవారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త అంబటి రాంబాబు ఆదివారం ఒక వీడియో విడుదల చేశారు. అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిపై ఆరోపణలు చేసినప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ నోరు విప్పి మాట్లాడకపోవడం వల్ల తనది తప్పించుకునే ధోరణిలా కనిపిస్తుందని, ప్రజలందరికీ తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంబటి రాంబాబు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఈ విషయంపై స్పందించాలని ఆయన కోరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్