తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్‌ను నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించినందుకు చింతకాయల విజయ్, సానా సతీష్, భాష్యం రామకృష్ణ లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభలో ప్రజల వాణిని సమర్థంగా వినిపించాలని, కేంద్రం-రాష్ట్రం మధ్య వారధిగా నిలిచి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని నూతన సభ్యులకు
లోకేశ్ సూచించారు.