పల్నాడు: ఘోర ప్రమాదం..ఒకరు మృతి

3464చూసినవారు
పల్నాడు: ఘోర ప్రమాదం..ఒకరు మృతి
తిరుమల శ్రీవారి దర్శనం కోసం పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుంచి వెళ్తున్న తుఫాన్ వాహనం, తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కన్నలి హైవేపై తెల్లవారుజామున ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్