మాజీమంత్రి అంబటి రాంబాబు గురువారం గుంటూరు వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు, లోకేశ్ గురించి తప్ప పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం వృథా అని విమర్శించారు. పవన్ మాటలు కోటలు దాటినా.. చేతలు గడప కూడా దాటవని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేశ్ పక్కన పవన్ జీరో అని చురకలంటించారు. పవన్ రాజకీయాల్లో చురుగ్గా లేరని ఇక ముందు కూడా ఉండబోరని జోస్యం చెప్పారు.