తాడేపల్లి మండలంలోని నులకపేటలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలో పైప్‌లైన్ మరమ్మత్తు పనులు నిర్వహిస్తుండగా, బురద నీటి కారణంగా విద్యుత్ షాక్‌కు గురై మున్సిపల్ కార్మికుడు అనిల్ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.