పల్నాడు: ఘోర ప్రమాదం.. నలుగురి మృతి

8656చూసినవారు
పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్