డిజిటల్ పెడగాగిపై వివిఐటియులో సదస్సు

0చూసినవారు
డిజిటల్ పెడగాగిపై వివిఐటియులో సదస్సు
గుంటూరు జిల్లా పొన్నూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలాజికల్ యూనివర్సిటీ (వివిఐటియు)లో అప్పా స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో డిజిటల్ పెడగాగి ఫర్ బిజినెస్ స్కూల్స్'పై సదస్సు శనివారం జరిగింది. బోధన, పరిశోధన, మూల్యాంకనం, కంటెంట్ సృష్టిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మరియు డిజిటల్ టూల్స్ వినియోగంపై సుమారు 100 మంది అధ్యాపకులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఐఐ ఏపీ చైర్మన్ నరేంద్ర కుమార్, ఏఐఎంఎస్ ప్రతినిధులు, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ రిసోర్స్ పర్సన్ అభిలాష్ పొన్నం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్