ఆత్మకూరు పరిధిలోని ఆరో బెటాలియన్ సమీపంలో ఈ నెల 22న వాహనం ఢీకొని సుమారు 30-35 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు. మృతుడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని, చేతికి పచ్చబొట్లు ఉన్నాయని ఆయన శనివారం చెప్పారు. ఇప్పటివరకు మృతుడికి సంబంధించిన వారెవరూ సంప్రదించలేదని, ఆచూకీ తెలిసినవారు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.