ప్రధాని మోదీని కలిసిన మంత్రి లోకేశ్.. ఏపీ ప్రజల తరఫున ధన్యవాదాలు

660చూసినవారు
ప్రధాని మోదీని కలిసిన మంత్రి లోకేశ్.. ఏపీ ప్రజల తరఫున ధన్యవాదాలు
నిన్న (బుధవారం) లోక్‌సభ అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. వైసీపీ మినహా అన్ని పార్టీలు మద్దతు పలికాయి. ఈ రోజు (గురువారం) బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో, మంత్రి నారా లోకేశ్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అయిన అమరావతికి చట్టబద్ధత కల్పించడంలో కృషి చేసినందుకు మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి నిబద్ధత చూపినందుకు లోకేశ్ ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్