తాడేపల్లి పరిధిలోని జాతీయ రహదారిపై మంగళవారం ఒక వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుని జేబులో లభించిన ఆధార్ కార్డుల ద్వారా బోయ వెంకటేశ్ (48), విజయవాడ కేఎల్ రావు కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుని నోటి నుంచి నురుగు రావడంతో, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని శవాగారానికి తరలించారు. మృతుని వివరాలపై మరింత సమాచారం తెలిసిన వారు తాడేపల్లి పోలీసులను సంప్రదించాలని కోరారు.