తాడేపల్లి: మూడు రాజధానులపై మరోసారి జగన్ కీలక వ్యాఖ్యలు

1524చూసినవారు
తాడేపల్లి: మూడు రాజధానులపై మరోసారి జగన్ కీలక వ్యాఖ్యలు
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధాని వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం అని, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలతో పోటీ పడేలా దానిని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేశామని ఆయన తెలిపారు. ఇందులో ఎలాంటి స్వార్థం లేదని, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలనుకున్నామని స్పష్టం చేశారు. అమరావతిని తొలగించాలని అనుకోలేదని, దానిని ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్