శనివారం ఉదయం నరసరావుపేటలో నివాసముంటున్న దర్శి పురపాలక సంఘం ఇన్‌ఛార్జ్ కమిషనర్ మహేశ్వరరావు ఇంటిపై ACB అధికారులు దాడులు నిర్వహించారు. సత్తెనపల్లి రోడ్డులోని సాయినగర్ మొదటి లైన్‌లో ఉన్న రామా డ్రీమ్స్ అపార్ట్‌మెంట్‌లో అధికారులు సోదాలు చేస్తున్నారు. నరసరావుపేట పురపాలక సంఘంలోనూ విధులు నిర్వహించిన మహేశ్ ప్రస్తుతం దర్శి ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. సోదాల అనంతరం మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.