నరసరావుపేటలో, ముప్పాళ్ల మండలం కుందూరువారిపాలెంకు చెందిన పదో తరగతి విద్యార్థిని భావన లక్ష్మి, ఆదివారం రాత్రి తండ్రి ఆకస్మిక మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తండ్రి పార్థివ దేహం ఇంట్లోనే ఉండగానే, కన్నీళ్లను దిగమింగుకుని సోమవారం పరీక్షకు హాజరైంది. విద్యపై ఆమెకున్న నిబద్ధత, ధైర్యాన్ని చూసి స్థానికులు, ఉపాధ్యాయులు చలించిపోయారు. విషాదంలోనూ విధిని ఎదిరించిన లక్ష్మిని అందరూ అభినందిస్తున్నారు.