రెంటచింతల: రిజర్వాయర్‌లో మృతదేహం కలకలం

1073చూసినవారు
రెంటచింతల: రిజర్వాయర్‌లో మృతదేహం కలకలం
రెంటచింతల మండలంలోని మంచికళ్లు బుగ్గ వాగు రిజర్వాయర్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యమవ్వడంతో కలకలం రేగింది. ఆదివారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ మృతదేహాన్ని గుర్తించారు. మృతుని వయస్సు సుమారు 35 ఏళ్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మృతదేహం తలభాగం నీటిలో బోర్లా పడి ఉండటంతో చేపలు పీకుతున్నట్లు కనిపించింది. ఇది ఆత్మహత్యనా లేక హత్యనా అనేది ఇంకా తేలాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్